Saturday, November 29, 2014

Letha Chaligalulu

Film: Moodumullu
Release : 1983
Actors: Chabndramohan, Radhika
Lyrics : Veturi
Music : Rajan-Nagendra




ఈ సినిమా ఎంత హాస్యంగా తీసారో ఈ సినిమా పోస్టర్స్ ని కూడా చూడగానే నవ్వు తెప్పించేలా వేశారు. హాస్యమే కాక మంచి సందేశంతో కూడుకున్న సినిమా ఇది. భార్య చనిపోయి చంటిపిల్లవాడితో ఆ ఊర్లో ఉద్యోగానికి వచ్చిన చంద్రమోహన్ ని ఇష్టపడి ఎన్నో ప్రయాతాలు చేసి తాళి కట్టించుకుంటుంది రాధిక. తాళి అయితే కట్టించుకో గలుగుతుంది కాని కలిసి కాపురం చేయలేకపోతుంది. ఎప్పుడూ చంద్రమోహన్ తో  కలలో విహరిస్తూ ఉంటుంది.  అందంగా ఉండే టీచర్ స్వప్న చంద్రమోహన్ ని ఎక్కడ సొంతం చేసుకుంటుందో అని వారిని దూరం ఉంచాలని ప్రయత్నాలు చేస్తుంది రాధిక. చిన్న పిల్లలతో తిరిగే రాధిక అంతగా జ్ఞానం ఎదగని అమ్మాయి. చంద్రమోహన్  కొడుకంటే ఎంతో ప్రాణం, అయితే ఈ పిచ్చిది నా పిల్లాన్ని ఎక్కడ ఏమి చేస్తుందో అని దూరం ఉంచుతుంటాడు చంద్రమోహన్. ఈ సినిమా తీసినపుడు ఎన్టీఆర్ కు తెలుగునాట బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి కొంత చూపించటమే కాకుండా అప్పుడే ప్రవేశపెట్టబడిన మద్యాహ్న భోజనం గురించి కూడా కొంత చూపించారు. సినిమాలో పాటాలు చాలా బాగుంటాయి. ప్రత్యేకంగా ఈ పాట విన్నప్పుడల్లా పాల్ టాక్ అమ్మాయి గుర్తుకు వస్తుంది, తను ఎక్కువగా ఇదే పాట ప్లే చేసేది. 



Monday, November 24, 2014

Ninne Ninne Talachukoni

Film: Pellichoopulu
Director: P.Sambashivarao
Music: K.V.Mahadevan
Lyrics: Atreya
Singers: S.P.Balasubrahmanyam, P.Susheela
Actors: Chandramohan, Vijayashanthi
Film Release : 1-January-1983





నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి. 1980s లో చంద్రమోహన్ గారు టాప్ హీరో. నాకంతగా సినీ జ్ఞానం తెలియని రోజులవి.  నా చిన్నప్పటినుండి దూరదర్శన్ చూసే అలవాటు. ప్రతి ఆదివారం ఒక తెలుగు సినిమా వచ్చేది అప్పట్లో. నా జీవితంలో చూసిన సినిమాలు ఎక్కువగా అవే. వారం రోజులు ఎదురుచూసి చూడటం బాగా అనిపించేది. ఈ సినిమా చూసానో లేదో జ్ఞాపకం లేదు కాని శుక్రవారం దూరదర్శన్ చిత్రలహరిలో ఈ పాటను చాలాసార్లు చూసాను. అద్భుతమైన మెలోడీ సాంగ్. మహదేవన్ గారి సంగీతం + ఆత్రేయ గారి కవిత్వం కలిసిందంటే అదే సూపర్ హిట్ సంగీత చిత్రం అయితీరాల్సిందే. ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది. ఇదే కాక ఈ చిత్రంలోని మిగతా పాటలు చాలా హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా వందరోజులు ఆడి సూపర్ హిట్ అయింది.  అప్పటివరకు తమిళ్ హీరోయిన్ గా ఉన్న విజయశాంతికి తెలుగులో మంచి స్థానం కలిపించి హీరోయిన్ గా ఎదగటానికి దోహదం చేసిన తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా తరువాతనే విజయశాంతి తెలుగులో బాగా పాపులర్ అయింది. 








Sunday, November 23, 2014

Jabillikosam

ఎందుకో ఏమో అయిదేళ్ళ క్రితం ఆపేసిన ఈ బ్లాగును మళ్ళీ రాయాలనిపించింది. మిగతా నా బ్లాగుల్లో ఆయా విషయాల గురించి వాటికి సంబందించిన విషయాలు రాయటం తప్ప నాలోని భావాలు తెలియజెప్పేవి కావు. అందుకేనెమో ఈ బ్లాగు మళ్ళీ తెరవాలనిపించింది. ఇప్పటినుండీ నాలోని భావాలు, జ్ఞాపకాలు తెలియజేసే విషయాలతో ఈ బ్లాగును వీలు దొరికినప్పుడల్లా రాయాలనుకుంటున్నాను.  


జాబిల్లికోసం ఆకాశమల్లే........ 

Film: Nireekshana
Music: Ilayaraja
Lyrics: Atreya
Singer: S.P. Balasubrahmanyam





1985 లో విడుదలయింది ఈ సినిమా. నా చిన్నప్పుడు రోజూ రేడియోలో వచ్చేది. ఈ పాట ఎందుకో నాకు బాగా నచ్చింది, రేడియోలో వచ్చినప్పుడల్లా మొత్తం దగ్గర ఉండి వినేవాన్ని. ఎలాగైనా, ఎప్పుడైనా ఈ సినిమా చూడాలి అని అనుకునేవాన్ని. ఇంట్లో అడిగితే ఒక్కన్ని వెళ్ళనివ్వరు అని  బావవరస బందువొకరు వస్తే సినిమాకు వెళ్దామని పట్టుబట్టి ఇద్దరం వెళ్లాం. మంచిమనసులు పోస్టర్ చూడగానే ఈ సినిమా బోర్ కుడుతుంది వద్దన్నాడు మా బందువు. ఇదేచూద్దాం అని నేను పట్టుబడితే వెళ్లి చూసాం. హాల్లో ఎక్కువ జనాలు లేరు, వెళ్ళిన కొద్ది సేపటికే మా బంధువు కూడా నిదురపోయాడు. నాకేమో కొంచెం క్లాసికల్ పిక్చర్స్ అంటే ఇంటరెస్ట్ ఎక్కువ. భానుచందర్ అప్పట్లో మంచి హీరో. భానుప్రియ కూడా అప్పుడప్పుడే పైకి వస్తుంది. ఇక రజని ఏమో అప్పట్లో సూపర్ హీరోయిన్. భానుప్రియ పాత్ర నాకు కంటతడి పెట్టించింది. విషాదపరమైన సినిమా. భానుప్రియ డాన్సు అద్భుతంగా ఉంటుంది - ప్రత్యేకించి "డమరుకము మ్రోగా"  అనే పాటలో.  "జాబిల్లికోసం" పాట ఈ సినిమాలో రెండుసార్లు వస్తుంది. పాటనే కాక పాట చిత్రీకరణ కూడా ఎంతో బాగుంది. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. నేను టేప్ రికార్డర్ కొన్నాక ఈ కాసేట్ ను రోజూ పడుకునేటప్పుడు వినేవాన్ని.