Monday, May 25, 2009

Ee Kshanam Okeoka Korika ..........

ఎలా చెప్పను (2003)

Actors: Shriya, Tarun, Abhi, Shiva Balaji
Director: B.V. Ramana
Music: Koti
Lyrics: Sirivennela Seetarama Shastry
Singer: Chitra




ఇది ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. ఒక అమ్మాయి - ముగ్గురు అబ్బాయిల చుట్టూ ప్రేమ కథ నడుస్తుంది. మన మనసులో వున్నది ఎలా చెప్పాలి అని ఆలోచించే లోపునే ఎన్నో జరిగి పోతూ వుంటాయి, మనుషులు దూరం అయిపోతారు, వేరే వాళ్ళ సొంతం కూడా అయిపోవచ్చు, దూరం పెరిగిపోతుంది, కనిపించకుండా కూడా పోతారు. వాళ్లు ఒకసారైనా ఫోన్ చేస్తారేమొ అని ఎదురుచూస్తూ వుంటాం, మెసేజ్ అయిన పెడతారేమో అని ఎపుడూ ఓపెన్ చేసి చూస్తుంటాం. ఒకసారి మనుషుల మద్యన దూరం పెరిగితే మనసుల మద్యన కూడా దూరం ఏర్పడవచ్చు. అందుకే ఏమైతే కానీ అని మనసులో వున్నది చెప్పుకోవాలి - మనుషులు దూరం కాకుండా చూసుకోవాలి. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ అవకాశాల్ని, మనుషులని పోగొట్టుకుంటాం, తరువాత బాధపడుతూ వుంటాం, నా విషయంలోను ఇది జరిగింది. ఈ సాంగ్ విన్నపుడల్లా గుర్తుకు వచ్చినా మళ్ళీ తిరిగి వెనక్కు రారుగా? (చాలా రేర్ గా జరుగుతుంది అనుకుంట తిరిగి రావటం).

Monday, May 18, 2009

Andangaalena? Assalembaalena? ......

గోదావరి (2006)

Actors: Sumanth, Kamalini Mukharjee
Director: Shekhar Kammula
Music: K.M. Radha Krishnan
Lyrics: Veturi




అందంగాలేనా అని కమలినీ ముఖర్జీ అడిగితే ఎవరు అందంగా లేవు అని అంటారు? ఆమె ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కూడా నటిస్తుంది. కళ్లతోనే నటించగల నటి. హిందీ లో పరిచయం అయినా రెండవ తెలుగు సినిమా ఆనంద్ (2004) తో టాప్ హిరోయిన్ అయింది. ఆనంద్ .... ఒక కాఫీ లాంటి సినిమా అని కాప్షన్ పెట్టి బాగా ఆకట్టుకున్నారు. అది కూడా శేఖర్ గారి డైరక్షన్ లోనే వచ్చింది. రెండిటికీ అవార్డులు-రివార్డులు వచ్చాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో ప్రపంచంలో వున్నట్టు గోదావరి లో వున్నట్టు అనిపించింది. వీడియో CD అరిగిపోయే వరకు ఎన్ని సార్లు చూసానో. ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది. కథలో విశేషం ఏమీ లేకున్నా నడిపించిన విధానం చాలా బాగుంది. కమలినీ ముఖర్జీ ని చూసినపుడు అచ్చంగా అలాంటి కళ్ళ అమ్మాయే నాకు గుర్తుకు వస్తూ వుంటుంది, తను సీతా మహాలక్ష్మి కేరెక్టర్ టైపు వుంటుంది కూడా.

Sunday, May 3, 2009

Paruvam Vaanagaa Nedu Kurisenule .......

రోజా (1992)

Actors: Aravinda Swamy, Madhu
Producer: K. Balachandar
Director: Manirathnam
Music: A.R. Rehman





ప్రేమ, దేశ భక్తి రెండు మిళితమైన మంచి సినిమా ఇది. ఇందులో మనం వెతుక్కోవాల్సిన ఎన్నో సందేశాలు వున్నాయి. కే. బాలచందర్ గారు మణిరత్నం గారి దర్శకత్వంలో నిర్మించడం విశేషం. రెహ్మాన్ ఈ సినిమా తోనే బాగా పాపులర్ అయ్యాడు, అంత చిన్న వయసులో ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు అని అందరూ పొగిడారు. చాల అవార్డులు సంపాదించుకుంది ఈ సినిమా. అరవింద స్వామి అమ్మాయిల డ్రీం బాయ్ అయితే మధు (హేమా మాలిని మేన కోడలు-మంచి డాన్సర్ కూడా) అబ్బాయిల డ్రీం గర్ల్ అయింది. మధు ఆక్టింగ్ చేసిన హిందీ ఫిలిం ఫూల్ అవుర్ కాంటే నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కి 17 మంది singers వాయిస్ ఇవ్వటం మరో విశేషం. ఈ సాంగ్ వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది. కాశ్మీర్ అందాలు ఇందులో చూడగలం. ఉగ్రవాదుల గొడవలు లేక మునుపు కష్మీరులోనే చాలా సినిమాలు తీసేవారు, ఇపుడు అక్కడ వెళ్లి చూడలేము, కొత్త సినిమాల్లోనూ చూడలేము ఇంక ఇలాంటి పాత సినిమాల్లో చూడటమే.