Tuesday, July 7, 2009

Ee Chempaku Selaveeyaku

దొంగ మొగుడు (1987)

Actors: Chiranjeevi, Madhavi, Radhika, Bhanupriya
Singers: Balu, Susheela
Music: Chakravarthi
Director: A. Kodandarami Reddy




ఈ సినిమా బాగా పాపులర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారి "నల్లంచు తెల్లచీర " నవల ఆధారంగా నిర్మించారు, ఆ టైం లో నవలలని సినిమాలుగా తీయటం క్రేజి గా వుండేది. కాష్మోరా బాగా హిట్ అయింది అప్పట్లో. ఇది మంచి హాస్యపు సినిమా, మంచి కాలక్షేపం సినిమా. చిరు 3 హీరోయిన్స్ తో డబల్ రోల్ చేసాడు. రాధిక తో నల్లంచు తెల్లచీర అనే సాంగ్ వుంటుంది - ఈ సాంగ్ లో నల్లంచు తెల్లచీర లేదు ఇంక రాధిక డ్రెస్ లే వేసుకుంది అని కామెంట్స్ చేసారు. సినిమా బాగా హిట్ అయింది. ఈ సాంగ్ లో రొమాన్స్ వున్నా సాంగ్ చాల మెలొడీ గా వినటానికి ఇంపుగా వుంటుంది. చిరంజీవి ఖైది సినిమా చిరు నే కాక మాధవి ని కూడా టాప్ పోసిషన్ కి తీసుకెళ్ళింది. హిందీ ఫిలిమ్స్ లో కూడా అమితాబ్ లాంటివాళ్లతో చేసింది. మాధవి చాలా హాట్ గ కనిపిస్తుంది, అప్పటి యూత్ కి ఆమె డ్రీం గర్ల్.

Monday, July 6, 2009

Paaraa Hushaar..... Paaraa Hushaar.....

స్వయంకృషి (1987)
Actors: Chiranjeevi, Vijayashanthi, Sumalatha
Music: Ramesh Naidu
Singers: Balu, Jaanaki
Lyrics: Sirivennela Seetharama Shastry
Director: K. Vishwanath
Producer: Edida Nageshwara Rao



పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సినిమా అంటేనే సినిమా బాగుంటుంది అని వెళ్ళేవారు, వాళ్లు తీసిన సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సీతాకోక చిలుక, సితార, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్భాందవుడు సినిమాలు బాగా హిట్ అయ్యాయి, అవార్డ్స్ కూడా వచ్చాయి. స్వయంకృషి సినిమా స్టొరీ అంటే నాకు చాల ఇష్టం, నాకు తెలిసిన చెప్పులు కుట్టేవాళ్ళు (మోచి) నే చిన్నగా వున్నపుడు మా ఏరియా కి వచ్చి కాపురం పెట్టారు - భార్య భర్తలు. వాళ్లు బాగా కష్టపడి ఇల్లు, పొలం, బంగారం లాంటివి కొన్నారు. పిల్లలు అందరికీ చదువు చెప్పించారు. ఈ సినిమా చూస్తె వాళ్ళే గుర్తుకు వస్తారు, స్వయంకృషి కి మించినది లేదు, ఎ పని చేసినా అది గౌరవమయినదే, చిరు ఇందులో చాల బాగా యాక్ట్ చేసాడు. మంచి సాంగ్ ఇది, అపుడు సూపర్ హిట్. విశ్వనాధ్ గారి సినిమాల్లో ఏదో ఒక ఆర్ట్ కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇందులో భిన్నంగా చెప్పులు చేసే పనినే ఒక ఆర్ట్ గా తీసుకున్నారు.

Friday, July 3, 2009

Mallepandiri Needalona Jaabilli.....

మాయదారి మల్లిగాడు (1973)

Actors: Krishna, Manjula, Jayanthi
Singer: P. Susheela
Lyrics: Atreya
Music: K. V. Mahadevan
Director: Adurthi Subbarao




సుశీల గారి సూపర్ హిట్ సాంగ్ ఇది. మాయదారి మల్లిగాడు సినిమాలో అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. మంజుల అపుడు గ్లామర్ హిరోయిన్, దాదాపు అందరు హీరోలు ఆమెతో యాక్ట్ చేసినవారే. జయంతి గారు కన్నడలో పాపులర్ అపుడు, తెలుగులో వచ్చి కొన్ని దశాబ్దాల పాటు యాక్ట్ చేసింది, జయంతి గారి గొంతు స్పెషల్ గా వుంటుంది, సింగర్ చాలా మంచి, చాలా మిమిక్రీ ఆర్టిస్టులు జయంతి గారి గొంతును అనుకరిస్తారు. ఈ సాంగ్ చూడటానికి కూడా బ్యూటిఫుల్ గా వుంటుంది. ఆదుర్తి గారే కృష్ణ ని పరిచయం చేసింది, హిందీలో కూడా పెద్ద డైరెక్టర్ - చాల కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసారు, తెలుగులో చాలా మంచి సినిమాలు తీసారు వీరు. ఆ కాలం సినిమాలలో ఫస్ట్ నైట్ సాంగ్స్ పెరట్లో తీసేవారు (ఇది చాలా సినిమాల్లో గమనించాను, బహుశ అప్పట్లో తొలి రాత్రులు పెరట్లో జరిగేవేమో? ఇపుడు పెరడు ఎక్కడిది, కనీసం అరుగులు కూడా వుండవు, రోడ్డే వుంటుంది, నిజమైన వెన్నెల రాత్రులు అనుభవించటం ఆ కాలం వాళ్ళకే చెల్లింది). మల్లెపందిరి, జాబిల్లి, చుట్టూ పూల చెట్లు, పచ్చ గడ్డి ఇవి ఇప్పుడు కోరుకుంటే వాడు కోటీశ్వరుడు అయి వుండాలి, అపుడు ఇవి సామాన్యుడికి కూడా అందుబాటులో వుండేవి. రాను రాను ప్రకృతి కూడా అందరికీ అందుబాటులో లేకుండా పోతుంది. ఇందులోవే నవ్వుతూ బ్రతకాలిరా సాంగ్ అండ్ వస్తా వెళ్ళొస్తా సాంగ్స్ కూడా సూపర్ గా వుంటాయి. ఈ సాంగ్ గురించి చెప్పటం కంటే చూస్తేనే బాగుంటుంది.

Tuesday, June 30, 2009

Raaraa........ Sarasaku Raaraa ........

ఆప్తమిత్ర (2004 - కన్నడ)

Actors: Soundarya, Vishnuvardhan, Dwarakesh, Ramesh Aravind, Prema
Director: P. Vasu
Music: Gurukiran



ఇది సౌందర్య నటించిన ఆప్తమిత్ర (చంద్రముఖి స్టొరీ) ఫిలిం లోది సాంగ్. ఆ సినిమా లో తెలుగులో వుంటుంది ఈ సాంగ్. నిజానికి చంద్రముఖి ఒరిజినల్ వెర్షన్ శోభన, మోహన్ లాల్ నటించిన మంచిమిత్రాజు అనే మలయాళం సినిమా (1993). ఒక దశాబ్దం తరువాత కన్నడ లో సౌందర్య నాయికగా ఆప్తమిత్ర పేరుతో తీసారు. కన్నడ ఫిలిం డైరెక్టర్ వాసు గారి దర్శకత్వంలోనే తమిళ్ లో జ్యోతిక హీరోయిన్ గా (2005) లో తీసారు - తమిళ్ వెర్షన్ బాగా హిట్ అయింది (చెన్నై శాంతి ధియేటర్ లో 800 డేస్ నడచింది అట), తెలుగు, హిందీ లో డబ్ అయింది.
సౌందర్య నటించిన చివరి సినిమా ఇది, చాలా బాగా యాక్ట్ చేసింది. సౌందర్య కి ఎంత చెత్త మేకప్ వేసిన అందంగాను, నవ్వుమోఖంతోనే కనిపిస్తుంది ఆమెని భయంకరంగా వూహించుకోలేము కూడ, జ్యోతిక నిజంగానే చంద్రముఖి పాత్రకి జీవం పోసింది - ఆమె ఆహార్యానికీ సరిపోయింది. ఈ సినిమా కన్నడలో 35 కోట్ల బిజినెస్ చేసి కన్నడ లో అల్ టైం రికార్డ్ సృష్టించింది. సౌందర్య కి బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడ వచ్చాయి. ఏది ఏమైనా కన్నడ సినిమా లో తెలుగు సాంగ్ పెట్టటం అందులో సౌందర్య నటించటం మన తెలుగువారు ఆనందించ తగ్గ విషయం.

Sunday, June 28, 2009

Ee Lokam Athipacchanaa ........

వసంత కోకిల (1983)
Actors: Kamal Hasan, Sridevi
Music: Ilayaraja
Director: Balu Mahendra




మనసులని కదలించివేసే సినిమా. బాలు మహేంద్ర గారి డైరక్షన్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి, వారి నిరీక్షణ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో కమల్, శ్రీదేవి ల నటన అద్భుతం. గతం మరచిపోయి హీరో దెగ్గర చేరటం, గతం గుర్తుకు రాగానే వెళ్ళిపోవటం - ఈ సబ్జెక్టు తో ఎన్నో సినిమాలు వచ్చాయి కాని ఈ సినిమా చెరగని ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. (సౌందర్య, రాజశేఖర్ ల సినిమా కూడా ఇలానే వుంటుంది అది కూడా చాలా బాగుంటుంది). సినిమా పేరులోనే ఉంది - వసంత కోకిల అని, కోకిలలు వసంత కాలంలోనే అపుడే చిగురించిన చిగురుల తింటూ ఆనందంగా కూస్తుంటాయి, ఎ చెట్టు బాగా కనిపిస్తే ఆ చెట్టుపై వాలుతుంటాయి, వసంత కాలం అయిపోగానే ఆ చెట్టు దరిదాపులో రాదు - కూయవు (చిగురులు పోయి ఆకులు రావటం అవి పండువాదిపోవటం, రాలిపోవటం జరిగినా ఇంక మళ్ళీ ఆ చెట్టు మొఖం చూడవు - పాపం చెట్టు మాత్రం అందంగా పాడే ఆ కోయిల మళ్ళీ ఎపుడు వస్తుందా అని, ఆ గొంతు మళ్ళీ వినాలని ఎదురు చూస్తూ వుంటుంది, మళ్ళీ కోయిలని ఆకర్షించటానికి ఆకులు రాల్చుకుని కొత్త చిగురులు తోడుగుకుని కోయిల రాకకై ఎదురు తెన్నులు కాస్తుంది. స్వేచ్చగా ప్రపంచం అంతటా తిరగగల కోయిల మళ్ళీ వస్తుందా? ఇలాంటి ఎన్ని చెట్లపైన అది వ్రాలి వుంటుంది, ఎన్ని చెట్లు పిచ్చిగా ఎదురు చూస్తుంటాయి? శ్రీదేవి కూడా గతం మరచి కమల్ పక్కన చేరుతుంది, లోకం తెలియని ఆ అమ్మాయిని పసిపిల్ల లాగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటాడు. ఇంక ఆమె తన లోకం అనుకుంటాడు. కాని శ్రీదేవి కి ఆరోగ్యం బాగు చేయిస్తే గతం గుర్తుకువచ్చి కమల్ ని వొదిలేసి వెళ్ళిపోతుంది. కమల్ ఒక పిచ్చివాడిలా అయిపోతాడు. ఆ సినిమా చూసాక కొన్ని రోజుల వరకూ నా మైండ్ సరిగా పనిచేయలేదు. ఈ సాంగ్ వినటానికే కాక చూడటానికి కూడా బావుంటుంది.

Friday, June 19, 2009

Kokila..... Kokila.... Kokila.....

కోకిల (1989)
Actors: Shobhana, Naresh, Sharath Babu, Geetha
Music: Ilayaraja
Singers: Balasubrahmanyam, Chithra
Director: Geetha Krishna




సస్పెన్స్ ఫిలిం ఇది బాగా హిట్ అయింది, ఇళయరాజా మ్యూజిక్ లో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. శోభన కి మంచి పేరు తెచ్చి పెట్టింది ఈ ఫిలిం, చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సాంగ్ బాగా పాపులర్ అపుడు, రోజు ఒక్కసారైనా వినపడేది ఎక్కడో ఓ చోట, ఇందులోదే గీత పైన తీసిన సాంగ్ కూడా సూపర్ వుంటుంది చేమ్మక చక్క అనే సాంగ్), శరత్ బాబు మీసాలు లేకుండా కనిపించింది ఈ ఒక్క సినిమాలోనే ఏమో? ఈ సినిమా డైరెక్టర్ గీతా కృష్ణ గారు మ్యూజిక్ కి ప్రాధాన్యత ఇస్తారు, తన కీచురాళ్ళు (1991, భానుచందర్) సంకీర్తన (1987 నాగార్జున) సినిమా లకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజానే తీసుకున్నారు. కోకిల పాట అంటే అమ్మాయి గొంతు కు సరితూచుతారు కాని నిజానికి కూ అని కూసే కోయిల మగ కోయిల అట - ఆడ కోయిలలు అలా కూయవు అని ఒకసారి రేడియో లో చెబితే విన్నాను.

Wednesday, June 10, 2009

Emani Paadanu Rendu Manasula Mooga Geetham .......

సీతా రామకల్యాణం (1986)

Actors: Balakrishna, Rajani
Singers: Balu, Susheela
Lyrics: Veturi
Music: K.V. Mahadevan
Director: Jandhyala
Producer: K. Murari



సీతా రామకల్యాణం సినిమా లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా వుంటాయి. యువ చిత్ర బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్ సాంగ్స్ వున్నవే - గోరింటాకు, త్రిశూలం, అభిమన్యుడు, శ్రీనివాసకల్యానం, జానకి రాముడు, నారి నారి నడుమ మురారి. బాలకృష్ణ 1986 లో నటించిన 6 ఫిలిమ్స్ 100 డేస్ చేసుకున్నాయి. రజని అపుడు టాప్ హీరోయిన్. ఈ సినిమా లో లంగా-వోనీల్లో చాలా బాగా కనిపిస్తుంది, పంజాబీ అమ్మాయి అయినా తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది. అందంగా వుండేది, చలాకీగా వుండేది. ఈ సినిమాలో స్టోరీ అండ్ కామెడి బాగా వుంటుంది. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం - జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే.


Monday, May 25, 2009

Ee Kshanam Okeoka Korika ..........

ఎలా చెప్పను (2003)

Actors: Shriya, Tarun, Abhi, Shiva Balaji
Director: B.V. Ramana
Music: Koti
Lyrics: Sirivennela Seetarama Shastry
Singer: Chitra




ఇది ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. ఒక అమ్మాయి - ముగ్గురు అబ్బాయిల చుట్టూ ప్రేమ కథ నడుస్తుంది. మన మనసులో వున్నది ఎలా చెప్పాలి అని ఆలోచించే లోపునే ఎన్నో జరిగి పోతూ వుంటాయి, మనుషులు దూరం అయిపోతారు, వేరే వాళ్ళ సొంతం కూడా అయిపోవచ్చు, దూరం పెరిగిపోతుంది, కనిపించకుండా కూడా పోతారు. వాళ్లు ఒకసారైనా ఫోన్ చేస్తారేమొ అని ఎదురుచూస్తూ వుంటాం, మెసేజ్ అయిన పెడతారేమో అని ఎపుడూ ఓపెన్ చేసి చూస్తుంటాం. ఒకసారి మనుషుల మద్యన దూరం పెరిగితే మనసుల మద్యన కూడా దూరం ఏర్పడవచ్చు. అందుకే ఏమైతే కానీ అని మనసులో వున్నది చెప్పుకోవాలి - మనుషులు దూరం కాకుండా చూసుకోవాలి. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ అవకాశాల్ని, మనుషులని పోగొట్టుకుంటాం, తరువాత బాధపడుతూ వుంటాం, నా విషయంలోను ఇది జరిగింది. ఈ సాంగ్ విన్నపుడల్లా గుర్తుకు వచ్చినా మళ్ళీ తిరిగి వెనక్కు రారుగా? (చాలా రేర్ గా జరుగుతుంది అనుకుంట తిరిగి రావటం).

Monday, May 18, 2009

Andangaalena? Assalembaalena? ......

గోదావరి (2006)

Actors: Sumanth, Kamalini Mukharjee
Director: Shekhar Kammula
Music: K.M. Radha Krishnan
Lyrics: Veturi




అందంగాలేనా అని కమలినీ ముఖర్జీ అడిగితే ఎవరు అందంగా లేవు అని అంటారు? ఆమె ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కూడా నటిస్తుంది. కళ్లతోనే నటించగల నటి. హిందీ లో పరిచయం అయినా రెండవ తెలుగు సినిమా ఆనంద్ (2004) తో టాప్ హిరోయిన్ అయింది. ఆనంద్ .... ఒక కాఫీ లాంటి సినిమా అని కాప్షన్ పెట్టి బాగా ఆకట్టుకున్నారు. అది కూడా శేఖర్ గారి డైరక్షన్ లోనే వచ్చింది. రెండిటికీ అవార్డులు-రివార్డులు వచ్చాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో ప్రపంచంలో వున్నట్టు గోదావరి లో వున్నట్టు అనిపించింది. వీడియో CD అరిగిపోయే వరకు ఎన్ని సార్లు చూసానో. ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది. కథలో విశేషం ఏమీ లేకున్నా నడిపించిన విధానం చాలా బాగుంది. కమలినీ ముఖర్జీ ని చూసినపుడు అచ్చంగా అలాంటి కళ్ళ అమ్మాయే నాకు గుర్తుకు వస్తూ వుంటుంది, తను సీతా మహాలక్ష్మి కేరెక్టర్ టైపు వుంటుంది కూడా.

Sunday, May 3, 2009

Paruvam Vaanagaa Nedu Kurisenule .......

రోజా (1992)

Actors: Aravinda Swamy, Madhu
Producer: K. Balachandar
Director: Manirathnam
Music: A.R. Rehman





ప్రేమ, దేశ భక్తి రెండు మిళితమైన మంచి సినిమా ఇది. ఇందులో మనం వెతుక్కోవాల్సిన ఎన్నో సందేశాలు వున్నాయి. కే. బాలచందర్ గారు మణిరత్నం గారి దర్శకత్వంలో నిర్మించడం విశేషం. రెహ్మాన్ ఈ సినిమా తోనే బాగా పాపులర్ అయ్యాడు, అంత చిన్న వయసులో ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు అని అందరూ పొగిడారు. చాల అవార్డులు సంపాదించుకుంది ఈ సినిమా. అరవింద స్వామి అమ్మాయిల డ్రీం బాయ్ అయితే మధు (హేమా మాలిని మేన కోడలు-మంచి డాన్సర్ కూడా) అబ్బాయిల డ్రీం గర్ల్ అయింది. మధు ఆక్టింగ్ చేసిన హిందీ ఫిలిం ఫూల్ అవుర్ కాంటే నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కి 17 మంది singers వాయిస్ ఇవ్వటం మరో విశేషం. ఈ సాంగ్ వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది. కాశ్మీర్ అందాలు ఇందులో చూడగలం. ఉగ్రవాదుల గొడవలు లేక మునుపు కష్మీరులోనే చాలా సినిమాలు తీసేవారు, ఇపుడు అక్కడ వెళ్లి చూడలేము, కొత్త సినిమాల్లోనూ చూడలేము ఇంక ఇలాంటి పాత సినిమాల్లో చూడటమే.

Saturday, April 25, 2009

Mounamelanoyi Ee Marapuraani Reyi .......

సాగర సంగమం (1983)
Actors: Kamal Hasan, Jayaprada
Director: K. Vishwanath
Music: Ilayaraja
Singers: Balasubrahmanyam, Janaki
Lyrics: Veturi





ఇది నా ఫేవరేట్ సినిమాల్లో ఒకటి. కమల్ హసన్ గారి ఆక్టింగ్ నాకు బాగా నచ్చింది, డాన్స్ బాగా చేసాడు. విశ్వనాధ్ గారి సినిమా లన్నీ కళా ప్రాధాన్యంగా వుంటాయి, ఇందులో శాస్త్రీయ నృత్యం ప్రధాన ఇతివ్రుత్తమైనా కమల్, జయప్రద ల మద్యన సాగే ప్రేమ నాకు చాల నచ్చింది. నేను చూసిన సినిమాల్లో 90% నా చిన్నపుడు టీవీ లో చూసినవే (1980s). ఎవైనా ప్రేమ సన్నివేశాలు వొస్తే టీవీ వాళ్ళు కట్ చేసేవారు (వాళ్ల కటింగ్ పొగ మిగిలినవి ఇంట్లో కట్ చేసేవాళ్ళు - ప్రేమించుకునే సన్నివేశాలు వొస్తే పిల్లలని అది తెమ్మని ఇది తెమ్మని పంపేవారు) . ఇపుడు చాలా మారిపోయింది ఈవెన్ పిల్లల షోస్ లోనే అంతకు మించిన సన్నివేశాలు చూపిస్తున్నారు. ఇందులోని మౌనమేలనోయి సాంగ్ ని అపుడు కట్ చేసి చూపారు. (విశ్వనాధ్ గారి చాలా సినిమాల్లో ఒక రొమాంటిక్ సాంగ్ వుంటుంది - మిగతావన్నీ పిల్లలు కూడా చూసేలా వుంటాయి) ఆ సాంగ్ మిస్ అయ్యాను అని సగం సినిమా చూసిన ఫీలింగ్ వుండేది. ఒక దశాబ్దం తరువాత కాని ఆ సాంగ్ చూడలేకపోయా. ఈ సినిమా లో అలీ సగం ఫోటోలు తీస్తుంటాడు (హాఫ్ బాడీ) , ఇది కూడా హాస్య సన్నివేశం అనిపించినా ఇద్దరి మద్యన వుండే అభిమానాన్ని తెలుపుతుంది. జయప్రద ఈ సాంగ్ లో ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఇదే సినిమా లో వయసు మళ్ళిన గెటప్ లోనూ అంతే అందంగా కనిపిస్తుంది. అందం అంటే ఆమెదే. రియల్ గా కూడా అప్పటికి - ఇప్పటకి జయప్రద గారిలో మార్పు లేదు. కలకాలం అలాగే వుండాలని అభిమాని గా నే కోరుకుంటున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమా కి. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఇళయరాజా అన్నా తన పేరుని సార్థకం చేసుకున్నాడు.

Thursday, April 2, 2009

Chuttu Chengaavi Cheera Kattaale Chilakammaa .....

తూర్పు వెళ్ళే రైలు (1979)

Actors: Mohan, Jyothi
Singer: S.P. Balasubrahmanyam
Music: S.P. Balasubrahmanyam
Lyrics: Arudra
Director: Bapu




ఈ సినిమా నా చిన్నపుడు టీవీ లో చూసా. అంతగా జ్ఞాపకంలేదు స్టొరీ కానీ ఆ టైం లోనే వచ్చిన పదహారేళ్ళ వయసు (1978) పోలికలు కొన్ని కనిపిస్తాయని మాత్రం జ్ఞాపకం వుంది. బాపు గారి సినిమా ఇది, ఈ సినిమా ద్వారా జ్యోతి హీరోయిన్ గా పరిచయం అయింది, బాపు బొమ్మలానే వుంటుంది. బాలు గారికి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా (ఐదవ మ్యూజిక్ డైరక్షన్ ఫిలిం ఇది). బాలు గారు పాడిన ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆడవాళ్ళకి చీర ఎంత అందంగా వుంటుందో ఈ సాంగ్ లో చెబుతారు - చూపిస్తారు. నిజంగానే చీర కట్టులో చాలా అందం వుంటుంది, అందుకే ఆ రోజుల్లో డిమాండ్ ని బట్టి అగ్గిపెట్టె లో పట్టే చీరను నేసి విదేశీయులకి పంపేవారు. చెప్పుకు పొతే ఈ చీర చరిత్ర చాల పెద్దగ వుంటుంది నాకు మటుకు ఆడవాళ్ళని చీరలో చూడటమే ఇష్టం.

Monday, March 16, 2009

Manishi Jeevitamlo Sampadane Mukhyam Kaadu ........

టెన్త్ క్లాస్ (2006)
Actors: Bharath, Sharanya, Sunaina
Lyrics and Dilouges: Kulashekar
Music: Micky J Mayor
Producer: P. V. Shyam Prasad
Story, Screenplay & Director: Chandu



టెన్త్ క్లాస్ సినిమా లో ఈ సన్నివేశం నాకు చాలా నచ్చింది. మనిషి జీవితంలో మనుషులు ఎంత ముఖ్యమో, ఒంటరి ప్రయాణం ఎంత భారంగా వుంటుందో ఈ సినిమా లో బాగా చూపించారు, మనకి ఇష్టమైన వాళ్లు పక్కనే వున్నా పట్టించుకోము కాని వాళ్లు దూరమైనపుడు ఎక్కడైనా కనిపిస్తారేమో అని వెతుకుతూ వుంటాం, డబ్బు మళ్ళీ సంపదిన్చుకోవచు, కాని మనుషులు ఒకసారి వెళ్లి పొతే మళ్ళీ తిరిగి రారు. డబ్బులను మంచినీల్లలా ఖర్చు చేస్తుంటారు, చాలా మటుకు పనికిరాని ఖర్చులే - అవే డబ్బుల్లో కొంత పక్కన పెట్టి వేరే వాళ్ళకి సహాయం చేస్తే ఎంత తృప్తి వుంటుందో ఈ సన్నివేశం చెబుతుంది.

Thursday, March 5, 2009

Edo Oka Raagam Palikindeevela ......

రాజా (1999)

Actors: Venkatesh, Soundarya
Singer: Chitra
Lyrics: Sirivennala Seetarama Shastri
Music: S.A. Rajkumar
Director:
Muppalaneni Shiva





ఇది నా ఫేవరేట్ సాంగ్స్ లో ఒకటి. ఈ సాంగ్ విన్నపుడల్లా అందరికీ అమ్మ - చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అందుకే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ఈ సినిమా చూసాకే సౌందర్య ని న ఫేవరేట్ యాక్టర్ల లిస్టు లో ఆడ్ చేసుకున్న. అందరిలో రాను రాను అందం తరుగుతూ వుంటుంది కాని సౌందర్య అందం రోజు రోజుకు పెరుగుతూనే పోయింది. పోటీని తట్టుకోవటానికో, సినిమా చాన్సేస్ దొరక్కనో దిగజారి పోతుంటారు, కాని ఆమె ఎపుడూ నిండుగానే ఆక్టింగ్ చేసింది అందుకే తను అందరిలా కాక ధృవ తారలా నిలిచి పోయింది. సినిమా వాళ్ళే కాదు పది కాలాల పాటు పదిమంది గుండెల్లో నిలిచిపోవలనుకునే ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టు కుంటే వాళ్లు శాశ్వతంగా వుండి పోతారు. కన్నడ వాళ్లు బాగా అందంగా వుండటమే కాక తెలుగు కల్చర్ కి దగ్గరగా వుండటం వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బాగా పైకి వచ్చారు. సరోజ దేవి, లక్ష్మి, జయంతి, సుమలత, అంబిక, రాధా, మాలాశ్రీ, సౌందర్య, ప్రేమ, అనుష్క.... చాలా వున్నారు. సౌందర్య ని చూసినపుడు మన ఇంటి మనిషిలా అనిపిస్తుంది. తను బ్రతికి వుంటే ఇలాంటి మంచి సినిమా లు ఎన్నో వచ్చేవి.

Wednesday, February 25, 2009

Jaanaki Kalaganaledu ........

రాజ్ కుమార్ (1983)

Singers: Balu, Susheela
Lyrics: Atryea
Music: Ilayaraja
Actors:
Shobhan, Jayasudha







చాలా మంచి సాంగ్ - లిరిక్స్ చాలా బాగుంటాయి, ఇళయరాజా మ్యూజిక్ అంటే నమ్మలేం (వారి రెగ్యులర్ బాణీలకు భిన్నంగా వుంటుంది ఈ సాంగ్). శోభన్ బాబు గారి సినిమాల్లోనే ఇలాంటి మెలొడీ సాంగ్స్ దొరుకుతాయి. ఇళయరాజా సాంగ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమీ వుండేది కాదు. ఒక అమ్మాయి పరిచయం తరువాతే ఇళయరాజా సాంగ్స్ పైన మక్కువ ఏర్పడింది. అన్ని రకాల మ్యూజిక్ ని చేసిన దిట్ట. వారి మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు వున్నాయి. వయసు పిలిచింది, అభిలాష, చాలెంజ్, ఆకలిరాజ్యం, సాగర సంగమం, సితార, అన్వేషణ, రాక్షసుడు, మరణ మృదంగం, స్వర్ణ కమలం, స్వాతిముత్యం, సీతాకోక చిలుక, అభినందన, గీతాంజలి, ఆరాధన (చిరు), ఆలాపన, ఘర్షణ, సింధుభైరవి (చిత్ర కి నేషనల్ అవార్డు వచ్చింది - చాల మంచి మ్యూజిక్ ఫిలిం), ప్రేమ (వెంకటేష్, రేవతి), నిర్ణయం, మహర్షి సినిమాల మ్యూజిక్ నాకు ఇష్టం. శోభన్ గారి ఫిలిమ్స్ కి ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చింది ఈ ఒక్క ఫిలిం కే అనుకుంటాను (NTR గారికి యుగంధర్ చేసాడు). ఈ సాంగ్ లో జయసుధ, శోభన్ ల స్టెప్స్ చాల బాగుంటాయి. అప్పట్లో డాన్స్ కంటే స్టెప్స్ ఫేమస్ వుండేవి.

Tuesday, February 10, 2009

Oka Venuvu Vinipinchenu


అమెరికా అమ్మాయి (1976)
  • Singer: G.Anand
  • Music: G.K. Venkatesh
  • Actors: Anne Cheymotty, Sreedhar, Ranganath
  • Director: Singeetham Sreenivasa Rao





సినిమా నా చిన్నపుడు T.V. లో చూసాను. ఈ పాట అప్పట్లో బాగా ఫేమస్. ఒక అమెరికా అమ్మాయి ఇండియన్ కల్చర్ ని ఫాలో అవ్వటం బేసిక్ గా సినిమా తీసారు. సింగీతం శ్రీనివాస రావు గారే మళ్ళీ ఒక దశాబ్దం తరువాత ఇదే సబ్జెక్టు తో ఫిలిం తీసారు (అమెరికా అబ్బాయి-1987). తెలుగు తనాన్ని చాటి చెప్పిన వాళ్ళలో వీరు ఒకరు.

Tuesday, January 27, 2009

అందరికీ స్వాగతం..........


అందరికీ స్వాగతం - నాకు నచ్చినవి, నే మెచ్చినవి, నాకు తెలిసినవి చెప్పలన్నదే నా వుద్దేశం, తప్పులు వుంటే చెబితే సంతోషిస్తాను.