Sunday, June 28, 2009

Ee Lokam Athipacchanaa ........

వసంత కోకిల (1983)
Actors: Kamal Hasan, Sridevi
Music: Ilayaraja
Director: Balu Mahendra




మనసులని కదలించివేసే సినిమా. బాలు మహేంద్ర గారి డైరక్షన్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి, వారి నిరీక్షణ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో కమల్, శ్రీదేవి ల నటన అద్భుతం. గతం మరచిపోయి హీరో దెగ్గర చేరటం, గతం గుర్తుకు రాగానే వెళ్ళిపోవటం - ఈ సబ్జెక్టు తో ఎన్నో సినిమాలు వచ్చాయి కాని ఈ సినిమా చెరగని ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. (సౌందర్య, రాజశేఖర్ ల సినిమా కూడా ఇలానే వుంటుంది అది కూడా చాలా బాగుంటుంది). సినిమా పేరులోనే ఉంది - వసంత కోకిల అని, కోకిలలు వసంత కాలంలోనే అపుడే చిగురించిన చిగురుల తింటూ ఆనందంగా కూస్తుంటాయి, ఎ చెట్టు బాగా కనిపిస్తే ఆ చెట్టుపై వాలుతుంటాయి, వసంత కాలం అయిపోగానే ఆ చెట్టు దరిదాపులో రాదు - కూయవు (చిగురులు పోయి ఆకులు రావటం అవి పండువాదిపోవటం, రాలిపోవటం జరిగినా ఇంక మళ్ళీ ఆ చెట్టు మొఖం చూడవు - పాపం చెట్టు మాత్రం అందంగా పాడే ఆ కోయిల మళ్ళీ ఎపుడు వస్తుందా అని, ఆ గొంతు మళ్ళీ వినాలని ఎదురు చూస్తూ వుంటుంది, మళ్ళీ కోయిలని ఆకర్షించటానికి ఆకులు రాల్చుకుని కొత్త చిగురులు తోడుగుకుని కోయిల రాకకై ఎదురు తెన్నులు కాస్తుంది. స్వేచ్చగా ప్రపంచం అంతటా తిరగగల కోయిల మళ్ళీ వస్తుందా? ఇలాంటి ఎన్ని చెట్లపైన అది వ్రాలి వుంటుంది, ఎన్ని చెట్లు పిచ్చిగా ఎదురు చూస్తుంటాయి? శ్రీదేవి కూడా గతం మరచి కమల్ పక్కన చేరుతుంది, లోకం తెలియని ఆ అమ్మాయిని పసిపిల్ల లాగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటాడు. ఇంక ఆమె తన లోకం అనుకుంటాడు. కాని శ్రీదేవి కి ఆరోగ్యం బాగు చేయిస్తే గతం గుర్తుకువచ్చి కమల్ ని వొదిలేసి వెళ్ళిపోతుంది. కమల్ ఒక పిచ్చివాడిలా అయిపోతాడు. ఆ సినిమా చూసాక కొన్ని రోజుల వరకూ నా మైండ్ సరిగా పనిచేయలేదు. ఈ సాంగ్ వినటానికే కాక చూడటానికి కూడా బావుంటుంది.

No comments:

Post a Comment