Tuesday, June 30, 2009

Raaraa........ Sarasaku Raaraa ........

ఆప్తమిత్ర (2004 - కన్నడ)

Actors: Soundarya, Vishnuvardhan, Dwarakesh, Ramesh Aravind, Prema
Director: P. Vasu
Music: Gurukiran



ఇది సౌందర్య నటించిన ఆప్తమిత్ర (చంద్రముఖి స్టొరీ) ఫిలిం లోది సాంగ్. ఆ సినిమా లో తెలుగులో వుంటుంది ఈ సాంగ్. నిజానికి చంద్రముఖి ఒరిజినల్ వెర్షన్ శోభన, మోహన్ లాల్ నటించిన మంచిమిత్రాజు అనే మలయాళం సినిమా (1993). ఒక దశాబ్దం తరువాత కన్నడ లో సౌందర్య నాయికగా ఆప్తమిత్ర పేరుతో తీసారు. కన్నడ ఫిలిం డైరెక్టర్ వాసు గారి దర్శకత్వంలోనే తమిళ్ లో జ్యోతిక హీరోయిన్ గా (2005) లో తీసారు - తమిళ్ వెర్షన్ బాగా హిట్ అయింది (చెన్నై శాంతి ధియేటర్ లో 800 డేస్ నడచింది అట), తెలుగు, హిందీ లో డబ్ అయింది.
సౌందర్య నటించిన చివరి సినిమా ఇది, చాలా బాగా యాక్ట్ చేసింది. సౌందర్య కి ఎంత చెత్త మేకప్ వేసిన అందంగాను, నవ్వుమోఖంతోనే కనిపిస్తుంది ఆమెని భయంకరంగా వూహించుకోలేము కూడ, జ్యోతిక నిజంగానే చంద్రముఖి పాత్రకి జీవం పోసింది - ఆమె ఆహార్యానికీ సరిపోయింది. ఈ సినిమా కన్నడలో 35 కోట్ల బిజినెస్ చేసి కన్నడ లో అల్ టైం రికార్డ్ సృష్టించింది. సౌందర్య కి బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడ వచ్చాయి. ఏది ఏమైనా కన్నడ సినిమా లో తెలుగు సాంగ్ పెట్టటం అందులో సౌందర్య నటించటం మన తెలుగువారు ఆనందించ తగ్గ విషయం.

Sunday, June 28, 2009

Ee Lokam Athipacchanaa ........

వసంత కోకిల (1983)
Actors: Kamal Hasan, Sridevi
Music: Ilayaraja
Director: Balu Mahendra




మనసులని కదలించివేసే సినిమా. బాలు మహేంద్ర గారి డైరక్షన్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి, వారి నిరీక్షణ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో కమల్, శ్రీదేవి ల నటన అద్భుతం. గతం మరచిపోయి హీరో దెగ్గర చేరటం, గతం గుర్తుకు రాగానే వెళ్ళిపోవటం - ఈ సబ్జెక్టు తో ఎన్నో సినిమాలు వచ్చాయి కాని ఈ సినిమా చెరగని ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. (సౌందర్య, రాజశేఖర్ ల సినిమా కూడా ఇలానే వుంటుంది అది కూడా చాలా బాగుంటుంది). సినిమా పేరులోనే ఉంది - వసంత కోకిల అని, కోకిలలు వసంత కాలంలోనే అపుడే చిగురించిన చిగురుల తింటూ ఆనందంగా కూస్తుంటాయి, ఎ చెట్టు బాగా కనిపిస్తే ఆ చెట్టుపై వాలుతుంటాయి, వసంత కాలం అయిపోగానే ఆ చెట్టు దరిదాపులో రాదు - కూయవు (చిగురులు పోయి ఆకులు రావటం అవి పండువాదిపోవటం, రాలిపోవటం జరిగినా ఇంక మళ్ళీ ఆ చెట్టు మొఖం చూడవు - పాపం చెట్టు మాత్రం అందంగా పాడే ఆ కోయిల మళ్ళీ ఎపుడు వస్తుందా అని, ఆ గొంతు మళ్ళీ వినాలని ఎదురు చూస్తూ వుంటుంది, మళ్ళీ కోయిలని ఆకర్షించటానికి ఆకులు రాల్చుకుని కొత్త చిగురులు తోడుగుకుని కోయిల రాకకై ఎదురు తెన్నులు కాస్తుంది. స్వేచ్చగా ప్రపంచం అంతటా తిరగగల కోయిల మళ్ళీ వస్తుందా? ఇలాంటి ఎన్ని చెట్లపైన అది వ్రాలి వుంటుంది, ఎన్ని చెట్లు పిచ్చిగా ఎదురు చూస్తుంటాయి? శ్రీదేవి కూడా గతం మరచి కమల్ పక్కన చేరుతుంది, లోకం తెలియని ఆ అమ్మాయిని పసిపిల్ల లాగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటాడు. ఇంక ఆమె తన లోకం అనుకుంటాడు. కాని శ్రీదేవి కి ఆరోగ్యం బాగు చేయిస్తే గతం గుర్తుకువచ్చి కమల్ ని వొదిలేసి వెళ్ళిపోతుంది. కమల్ ఒక పిచ్చివాడిలా అయిపోతాడు. ఆ సినిమా చూసాక కొన్ని రోజుల వరకూ నా మైండ్ సరిగా పనిచేయలేదు. ఈ సాంగ్ వినటానికే కాక చూడటానికి కూడా బావుంటుంది.

Friday, June 19, 2009

Kokila..... Kokila.... Kokila.....

కోకిల (1989)
Actors: Shobhana, Naresh, Sharath Babu, Geetha
Music: Ilayaraja
Singers: Balasubrahmanyam, Chithra
Director: Geetha Krishna




సస్పెన్స్ ఫిలిం ఇది బాగా హిట్ అయింది, ఇళయరాజా మ్యూజిక్ లో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. శోభన కి మంచి పేరు తెచ్చి పెట్టింది ఈ ఫిలిం, చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సాంగ్ బాగా పాపులర్ అపుడు, రోజు ఒక్కసారైనా వినపడేది ఎక్కడో ఓ చోట, ఇందులోదే గీత పైన తీసిన సాంగ్ కూడా సూపర్ వుంటుంది చేమ్మక చక్క అనే సాంగ్), శరత్ బాబు మీసాలు లేకుండా కనిపించింది ఈ ఒక్క సినిమాలోనే ఏమో? ఈ సినిమా డైరెక్టర్ గీతా కృష్ణ గారు మ్యూజిక్ కి ప్రాధాన్యత ఇస్తారు, తన కీచురాళ్ళు (1991, భానుచందర్) సంకీర్తన (1987 నాగార్జున) సినిమా లకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజానే తీసుకున్నారు. కోకిల పాట అంటే అమ్మాయి గొంతు కు సరితూచుతారు కాని నిజానికి కూ అని కూసే కోయిల మగ కోయిల అట - ఆడ కోయిలలు అలా కూయవు అని ఒకసారి రేడియో లో చెబితే విన్నాను.

Wednesday, June 10, 2009

Emani Paadanu Rendu Manasula Mooga Geetham .......

సీతా రామకల్యాణం (1986)

Actors: Balakrishna, Rajani
Singers: Balu, Susheela
Lyrics: Veturi
Music: K.V. Mahadevan
Director: Jandhyala
Producer: K. Murari



సీతా రామకల్యాణం సినిమా లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా వుంటాయి. యువ చిత్ర బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్ సాంగ్స్ వున్నవే - గోరింటాకు, త్రిశూలం, అభిమన్యుడు, శ్రీనివాసకల్యానం, జానకి రాముడు, నారి నారి నడుమ మురారి. బాలకృష్ణ 1986 లో నటించిన 6 ఫిలిమ్స్ 100 డేస్ చేసుకున్నాయి. రజని అపుడు టాప్ హీరోయిన్. ఈ సినిమా లో లంగా-వోనీల్లో చాలా బాగా కనిపిస్తుంది, పంజాబీ అమ్మాయి అయినా తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది. అందంగా వుండేది, చలాకీగా వుండేది. ఈ సినిమాలో స్టోరీ అండ్ కామెడి బాగా వుంటుంది. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం - జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే.