Sunday, November 23, 2014

Jabillikosam

ఎందుకో ఏమో అయిదేళ్ళ క్రితం ఆపేసిన ఈ బ్లాగును మళ్ళీ రాయాలనిపించింది. మిగతా నా బ్లాగుల్లో ఆయా విషయాల గురించి వాటికి సంబందించిన విషయాలు రాయటం తప్ప నాలోని భావాలు తెలియజెప్పేవి కావు. అందుకేనెమో ఈ బ్లాగు మళ్ళీ తెరవాలనిపించింది. ఇప్పటినుండీ నాలోని భావాలు, జ్ఞాపకాలు తెలియజేసే విషయాలతో ఈ బ్లాగును వీలు దొరికినప్పుడల్లా రాయాలనుకుంటున్నాను.  


జాబిల్లికోసం ఆకాశమల్లే........ 

Film: Nireekshana
Music: Ilayaraja
Lyrics: Atreya
Singer: S.P. Balasubrahmanyam





1985 లో విడుదలయింది ఈ సినిమా. నా చిన్నప్పుడు రోజూ రేడియోలో వచ్చేది. ఈ పాట ఎందుకో నాకు బాగా నచ్చింది, రేడియోలో వచ్చినప్పుడల్లా మొత్తం దగ్గర ఉండి వినేవాన్ని. ఎలాగైనా, ఎప్పుడైనా ఈ సినిమా చూడాలి అని అనుకునేవాన్ని. ఇంట్లో అడిగితే ఒక్కన్ని వెళ్ళనివ్వరు అని  బావవరస బందువొకరు వస్తే సినిమాకు వెళ్దామని పట్టుబట్టి ఇద్దరం వెళ్లాం. మంచిమనసులు పోస్టర్ చూడగానే ఈ సినిమా బోర్ కుడుతుంది వద్దన్నాడు మా బందువు. ఇదేచూద్దాం అని నేను పట్టుబడితే వెళ్లి చూసాం. హాల్లో ఎక్కువ జనాలు లేరు, వెళ్ళిన కొద్ది సేపటికే మా బంధువు కూడా నిదురపోయాడు. నాకేమో కొంచెం క్లాసికల్ పిక్చర్స్ అంటే ఇంటరెస్ట్ ఎక్కువ. భానుచందర్ అప్పట్లో మంచి హీరో. భానుప్రియ కూడా అప్పుడప్పుడే పైకి వస్తుంది. ఇక రజని ఏమో అప్పట్లో సూపర్ హీరోయిన్. భానుప్రియ పాత్ర నాకు కంటతడి పెట్టించింది. విషాదపరమైన సినిమా. భానుప్రియ డాన్సు అద్భుతంగా ఉంటుంది - ప్రత్యేకించి "డమరుకము మ్రోగా"  అనే పాటలో.  "జాబిల్లికోసం" పాట ఈ సినిమాలో రెండుసార్లు వస్తుంది. పాటనే కాక పాట చిత్రీకరణ కూడా ఎంతో బాగుంది. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. నేను టేప్ రికార్డర్ కొన్నాక ఈ కాసేట్ ను రోజూ పడుకునేటప్పుడు వినేవాన్ని.